Amadalavalasa: కూటమి బలపరిచిన అభ్యర్థిగా భారీ ర్యాలీ నడుమ నామినేషన్ దాఖలు!

Amadalavalasa: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస ఎంపీటీసీ స్థానానికి కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి జోగి చందు మనోహర్ వేడుకగా నామినేషన్ దాఖలు చేశారు.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 24 Oct 2026 8:42 AM IST
Amadalavalasa
X

Amadalavalasa: కూటమి బలపరిచిన అభ్యర్థిగా భారీ ర్యాలీ నడుమ నామినేషన్ దాఖలు!

Amadalavalasa: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని గాజుల కొల్లివలస ఎంపీటీసీ స్థానానికి కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి జోగి చందు మనోహర్ శుక్రవారం (అక్టోబర్ 23) ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన నామినేషన్ కార్యక్రమానికి ఆర్.ఆర్. కాలనీ, కొల్లివలస, సైలాడ పంచాయతీలకు చెందిన కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమక్షంలో నామినేషన్ కార్యక్రమం జరిగింది.

గాజుల కొల్లివలస ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున జోగి చందు మనోహర్ అభ్యర్థిత్వాన్ని కూటమి బలపరిచిన నేపథ్యంలో స్థానికంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA