Ichchapuram: ఇచ్ఛాపురంలో రైల్వే గేటు వద్ద తీవ్ర ట్రాఫిక్ నరకం!
Ichchapuram: ఇచ్ఛాపురం రైల్వే గేటు వద్ద నిత్యం తీవ్ర ట్రాఫిక్ కష్టాలు. సర్వే జరిపిన ప్రధాన కూడలిలోనే ఫ్లైఓవర్ నిర్మించాలని 15 గ్రామాల ప్రజల డిమాండ్.
Ichchapuram: ఇచ్ఛాపురంలో రైల్వే గేటు వద్ద తీవ్ర ట్రాఫిక్ నరకం!
Ichchapuram: రైల్వే గేటు పడితే చాలు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోవాల్సిందే. అంబులెన్స్‌లు సైరన్ మోగిస్తూ నిలిచిపోవాల్సిందే, విద్యార్థులు స్కూళ్లకు ఆలస్యంగా వెళ్లాల్సిందే, పనులకు వెళ్లే సామాన్యులు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సిందే. ఈ నిత్య నరకయాతనకు శాశ్వత పరిష్కారంగా రైల్వే ఫ్లైఓవర్ మంజూరై, సర్వే పనులు కూడా పూర్తయినప్పటికీ… ఆ ప్రాజెక్టు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అవసరమైన ప్రధాన కూడలి వద్ద కాకుండా, ప్రజల రాకపోకలకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా ఊరికి దూరంగా ఎక్కడో నిర్మాణం జరిపించేందుకు కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒక్క రైల్వే గేటుపై దాదాపు 15కి పైగా చుట్టుపక్కల గ్రామాలు ఆధారపడి ఉన్నాయి.
నిత్యావసరాలు కొనాలన్నా ఇదే ప్రధాన మార్గo. నిత్యం గేటు పడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి విలవిల్లాడుతున్నారు. ఊరికి దూరంగా ఫ్లైఓవర్ నిర్మిస్తే ఆ దారి నిర్మానుష్యంగా మారి, రాత్రి వేళల్లో తీవ్ర అభద్రతా పరిస్థితులు ఏర్పడతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 15 గ్రామాల విద్యార్థులు, ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సర్వే జరిగిన అసలైన ప్రాంతంలోనే తక్షణమే ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




