Ichchapuram: శివనామస్మరణతో మారుమోగిన ఇచ్చాపురం ఆలయాలు!

Ichchapuram: కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 16 Nov 2026 10:37 AM IST
Ichchapuram
X

Ichchapuram: శివనామస్మరణతో మారుమోగిన ఇచ్చాపురం ఆలయాలు!

ఇచ్చ్చాపురం: పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని ఇచ్చాపురం పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరి మంత్రంతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది.

సోమవారం వేకువజాము నుంచే భక్తులు బహుదా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో అరటి డొప్పలపై కార్తీక దీపాలను వెలిగించి బహుదా నదిలో వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీ తీరమంతా దీపాల కాంతులతో శోభాయమానంగా కనిపించింది.

అక్కడి నుంచి భక్తులు నేరుగా శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి వేకువజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు మరియు విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి పాలు, పండ్లు, పూలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.

కార్తీక మొదటి సోమవారం కావడంతో పట్టణంలోని మిగిలిన శివాలయాలు, బహుదా నది తీర ప్రాంతాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram