Ichchapuram: ఇచ్చాపురంలో అరుదైన సీన్ ఒకే ఇంట్లో ఇద్దరు కౌన్సిలర్లు!

Ichchapuram: ఇచ్చాపురం మున్సిపాలిటీలో అరుదైన ఘట్టం. టీడీపీ తరఫున కౌన్సిలర్లుగా గెలిచిన భార్యాభర్తలు. ఒకరు ఏకగ్రీవం, మరొకరు విజయం సాధించి కౌన్సిల్‌లోకి ఎంట్రీ.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 3 Nov 2026 2:37 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్చాపురంలో అరుదైన సీన్ ఒకే ఇంట్లో ఇద్దరు కౌన్సిలర్లు!

ఇచ్చాపురం: ఇచ్చాపురం మున్సిపాలిటీ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు ప్రజాప్రతినిధులు కొలువుదీరనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘం ఎన్నికల్లో భార్యాభర్తలిద్దరూ తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్లుగా గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించారు.

స్థానిక 24వ వార్డు నుంచి భర్త ఎన్నికల బరిలో నిలవగా, అక్కడ ప్రత్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక పక్కనే ఉన్న 25వ వార్డు నుంచి పోటీ చేసిన ఆయన సతీమణి, హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. దీంతో ఒకరు ఏకగ్రీవంగా, మరొకరు ప్రజాతీర్పుతో కౌన్సిల్ హాలులోకి అడుగుపెట్టనున్నారు.

ఒకే కుటుంబం నుంచి భార్యాభర్తలిద్దరూ ఒకేసారి మున్సిపల్ కౌన్సిలర్లుగా బాధ్యతలు చేపట్టనుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమ వార్డుల అభివృద్ధికి ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు ఆ దంపతుల నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇచ్చాపురం పట్టణంలో ఈ 'దంపతుల విజయం' హాట్ టాపిక్‌గా మారింది.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram