Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల!
Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపల్ సాధారణ ఎన్నికల తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన కమిషనర్ ఎన్. రమేష్. 28 వార్డుల వివరాలు మున్సిపల్ ఆఫీసులో అందుబాటులో ఉంచినట్లు వెల్లడి.
Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల!
Ichchapuram: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రానున్న మున్సిపల్ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఇచ్ఛాపురం పురపాలక సంఘం పరిధిలోని ఓటర్ల తుది జాబితాను సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11:30 గంటలకు మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎన్. రమేష్ ఈ జాబితాను విడుదల చేశారు.
పురపాలక పరిధిలోని మొత్తం 28 వార్డులకు సంబంధించిన ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) మరియు మహిళా ఓటర్ల వివరాలతో కూడిన తుది జాబితాను వార్డుల వారీగా క్రోడీకరించి ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




