Makarampuram: భారీ వర్షాలకు కూలిన పేద కుటుంబం ఇంటి గోడ!
Makarampuram: అర్నాబ్ తుఫాను వర్షాలకు కంచిలి మండలం మకరాంపురంలో నిరుపేద మహిళ హేమ ఇంటి గోడ కూలిపోయింది. ప్రాణనష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు.
Makarampuram: భారీ వర్షాలకు కూలిన పేద కుటుంబం ఇంటి గోడ!
Makarampuram: కంచిలి అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామం గుడియావీధిలో బొగియా హేమకు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
నిరుపేద కుటుంబానికి చెందిన హేమ భర్త బొగియా భుద్యాడు సుమారు ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలిపోవడంతో కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు స్పందించి బాధితురాలు హేమకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




