Tekkali: టెక్కలిలో భారీ వర్షానికి భవానీనగర్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు!
Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీనగర్‌లో భారీ వర్షాలకు డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tekkali: టెక్కలిలో భారీ వర్షానికి భవానీనగర్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు!
Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో భారీ వర్షానికి భవాని నగర్ లో ఇంట్లోకి చేరిన వర్షపు నీరు, రోడ్లు మరియు డ్రైనేజీలు ఆక్రమణ వలనే మాకీ దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు.
డ్రైనేజీలు లో ఉండాల్సిన నీరు మా ఇళ్లల్లోకి వస్తే మాకు దిక్కెవరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పలు కుటుంబాలు, వర్షపు నీటితో ఇబ్బందులు పడ్డ స్థానికులు. సమాచారం అందుకున్న అధికారులు, కూటమి నాయకులు, భవానీనగర్‌లో పరిస్థితిని పరిశీలించిన అధికారులు, నేతలు, వీధి రోడ్లపై ఆక్రమణలతో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం. టెక్కలిలో పలుచోట్ల జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలు.
పలు జిల్లాల్లో ఆర్నాబ్ తుఫాను దాటికి గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు మరియు డ్రైనేజీలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని దగ్గర్లో రహదారులుకు ఆనుకుని ఉన్న వాగులు ఉప్పొంగడంతో రోడ్లపైకే నీరు చేరి వాహనదారుల ప్రయాణానికి ఆటంకాలుగా మారాయి.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం లో టెక్కలి స్థానిక భవాని నగర్ లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా డ్రైనేజీల్లో పయనించాల్సిన వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడం వలన స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రోడ్లు మరియు డ్రైనేజీలు ఆక్రమణ వలనే మాకీ దుస్థితి అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీలు లో ఉండాల్సిన మరుగు నీరు మా ఇళ్లల్లోకి వస్తే మా అనారోగ్య సమస్యలకు బాధ్యులెవరు ద అంటూ పలు కుటుంబాలు ఆవేదంలో వ్యక్తం చేస్తున్నాయి, అయితే సమాచారం అందుకున్న అధికారులు, కూటమి నాయకులు పరిస్థితిని సమీక్షించారు. వీధి రోడ్లపై ఆక్రమణలతో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం. టెక్కలిలో పలుచోట్ల బాపిరెడ్డి కాలనీ భవాని నగర్ మండపం కాలనీ ఇలా చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.
భారీ వర్షాలతో అవస్థలు పడుతున్న ప్రజలకి శాశ్వత పరిష్కారాలు చూపించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చిన ఏ నాయకులు మారిన ఆక్రమణలపైనే దృష్టి పెడుతున్నారు కానీ దాని వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను మాత్రం దృష్టిలో పెట్టుకోవడం లేదని వాపోతున్నారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు నేతలకు స్థానికులు డిమాండ్ చేశారు.




