Srikakulam: మడ్డువలస రిజర్వాయర్‌కు పెరిగిన వరద ఉద్ధృతి!
Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని మడ్డువలస రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద నీరు. 7 గేట్లు ఎత్తి 25,400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు.
Srikakulam: మడ్డువలస రిజర్వాయర్‌కు పెరిగిన వరద ఉద్ధృతి!
Srikakulam: వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌లోకి నదుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. గురువారం ఉదయం 7గంటలకు సుమారు 35900క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు రిజర్వాయర్ ప్రధాన 7 గేట్లను ఎత్తి 25400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గంటల వ్యవధిలోనే వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.




