Rajam: రాజాంను కమ్మేసిన దట్టమైన మంచు దుప్పటి!
Rajam: శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆదివారం తెల్లవారుజామున కమ్మేసిన దట్టమైన పొగమంచు. నెల రోజుల ముందుగానే మంచు కురవడంతో వాతావరణ మార్పులపై ప్రజల్లో ఆందోళన.
Rajam: రాజాంను కమ్మేసిన దట్టమైన మంచు దుప్పటి!
Rajam: రాజాం పట్టణాన్ని ఆదివారం తెల్లవారుజామున దట్టమైన మంచు కమ్మేసింది. ఉదయం వేళ ఎదురుగా ఉన్న మనుషులు సైతం కనిపించని విధంగా పొగమంచు అలుముకోవడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
సాధారణంగా డిసెంబర్ నెల నుంచి కనిపించే పొగమంచు ఈ ఏడాది నెల రోజుల ముందుగానే దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే ఇందుకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.
గ్లోబల్ వార్మింగ్ తదితర కారణాలతో వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఈ ఏడాది ఎండలు, వర్షాలు కూడా సాధారణ రుతువులకు అనుగుణంగా కాకుండా క్రమం తప్పుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఈ వాతావరణ మార్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.




