Palakonda: పాలకొండలో వైభవంగా శ్రీ కోటదుర్గమ్మ తల్లి వారి శరన్నవరాత్రి ఉత్సవాలు!

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శ్రీ శ్రీ శ్రీ కోటదుర్గమ్మ తల్లి వారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

KAILASH SAHU, PALAKONDA
Published on: 11 Oct 2026 9:44 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో వైభవంగా శ్రీ కోటదుర్గమ్మ తల్లి వారి శరన్నవరాత్రి ఉత్సవాలు!

Palakonda: కళింగఆరాధ్య దైవం పాలకొండ వాసుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ కోటదుర్గమ్మ తల్లి వారి శరన్నవరాత్రి ఉత్సవాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నుండి అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ కోటదుర్గమ్మ తల్లి వారి ఉత్సవాలుఉదయం ముహూర్తపురాటతో ప్రారంభం అయ్యి)) అమ్మవారి నిజరూప దర్శనం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అశేష భక్తజనులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లను పూర్తి చేశారు, 20వ తేదీ విజయదశమి వరకు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.

భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది రోజులు ఉత్సవాలలో నిత్య అన్న సమారాధన ప్రసాద కార్యక్రమం భక్తులకు దాతల సహాయంతో చేయడం జరుగుతుంది ప్రత్యేక వైద్య శిబిరము త్రాగునీటి సౌకర్యంతో పాటు ఏర్పాట్లను పూర్తి చేశారు.

విద్యుత్తు కాంతులతో సంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి అనువుగా స్టేజీలను ఏర్పాటు చేశారు. 10 రోజులు పాటు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారి రూపాలను ఏర్పాటు చేయనున్నారు ప్రతిరోజు కుంకుమ పూజలు అమ్మవారి సంబరాలు ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు.

పటిష్టమైన పోలీస్ బందోబస్తు డిఎస్పి. ఎం.రాంబాబు. సి.ఐ ప్రసాదరావు ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవ కార్యక్రమాలు పర్యవేక్షణ సమన్వయకర్త (పల్లా కొండబాబు)కుటమి నాయకులు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.వి సూర్యనారాయణ దసరా ఉత్సవాలు ఎంతోప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని భక్తజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని చక్కగా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మనేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు

తెలిపారు భక్తజనులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శనం చేసుకునితరించాలని ఈ సందర్భంగా భక్తులకు పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి మరియు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా నుంచి భారీగా అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈ కోట దుర్గ అమ్మవారిని అంత ప్రత్యేకత ఉంది.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA