Kanchili: కర్తలిలో ఘనంగా నందమ్మ గౌరమ్మ సంబరాలు

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కర్తలిలో 7 రోజులపాటు సాగిన నందమ్మ గౌరమ్మ సంబరాలు వైభవంగా ముగిశాయి; ఊరేగింపు అనంతరం నిమజ్జనం నిర్వహించారు.

G.RAMBABU, SOMPET
Published on: 31 Oct 2026 10:31 PM IST
Kanchili
X

Kanchili: కర్తలిలో ఘనంగా నందమ్మ గౌరమ్మ సంబరాలు

శ్రీకాకుళం జిల్లా: కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ పరిధిలోని కర్తలి గ్రామంలో నందమ్మ గౌరమ్మ సంబరాలు ఏడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజైన నేడు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపు నిర్వహించనున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, గ్రామ పెద్దలు, పూజా కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏడు రోజులపాటు జరిగిన ఈ సంబరాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET