Kanchili: సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్ బెందాళం అశోక్

Kanchili: కంచిలి మండలంలో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌‌బాబు శనివారం లబ్ధిదారులకు అందజేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 3 Oct 2026 7:25 PM IST
Kanchili
X

Kanchili: సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్ బెందాళం అశోక్

Kanchili: కంచిలి మండలంలోని పలు గ్రామాలకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. బూరగాం గ్రామపంచాయతీకి చెందిన కర్రి లల్లికి రూ.1,37,235 విలువైన చెక్కును అందించారు.

అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించలేని వారికి సీఎం సహాయ నిధి ఆర్థికంగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు.

కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు మాదిన రామారావు, బూరగాం గ్రామపంచాయతీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET