Kanchili: పెద్ద కొజ్జీరియాలో రూ. 61,000 పలికిన వినాయక లడ్డూ!
Kanchili: కంచిలి మండలం పెద్ద కొజ్జీరియాలో వినాయక నిమజ్జన వేడుకలు. లడ్డూ వేలంలో రికార్డు ధర.. ₹61,000లకు దక్కించుకున్న నిల్తీ జగదీష్
Kanchili: పెద్ద కొజ్జీరియాలో రూ. 61,000 పలికిన వినాయక లడ్డూ!
Kanchili: కంచిలి మండలం పెద్ద కొజ్జీరియా గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గ్రామ యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. డప్పులు, మేళతాళాల నడుమ నిమజ్జనోత్సవం సందడిగా సాగింది. నిమజ్జనోత్సవంలో నిర్వహించిన వినాయక లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లడ్డూను రూ.61000 లకు నిల్తీ జగదీష్ దక్కించుకున్నారు సొంతం చేసుకున్నారు. పెద్ద కొజ్జీరియా లో లడ్డూ వేలం సంప్రదాయాన్ని 1998లో యువత ప్రారంభించింది. అప్పట్లో రూ. 1,000 తో ప్రారంభమైన ఈ వేలం ఏటా భక్తుల విశ్వాసంతో పెరుగుతూ ప్రస్తుతం రూ. 61000 వేలకు చేరుకుంది.
లడ్డూను దక్కించుకుంటే ఇంటిల్లిపాదికీ శుభాలు కలుగుతాయనే నమ్మకంతో భక్తులు పోటీ పడుతున్నారు.గ్రామం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భక్తులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొడ్డ పృథ్వీ బాబు, బొడ్డ విజయకుమార్ తదితర కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




