Palakonda: కేంద్రంలో నేలబావిలో పడిన మూడు నెలల పాపను రక్షించిన ఫైర్ సిబ్బంది

Palakonda: చిన్నబల్లంకి వీధిలో నేలబావిలో పడిన మూడు నెలల పసిపాపను అగ్నిమాపక సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా రక్షించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 9 Oct 2026 6:46 PM IST
Palakonda
X

Palakonda: కేంద్రంలో నేలబావిలో పడిన మూడు నెలల పాపను రక్షించిన ఫైర్ సిబ్బంది

పాలకొండ: నేలబావిలో పడిన మూడు నెలల పాపను రక్షించిన ఫైర్ సిబ్బంది డివిజన్ కేంద్రంలోని చిన్నబల్లంకి వీధి నేలబావిలో పడిపోయిన మూడు నెలల పసిపాపను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు.

చిన్న బల్లంకి వీధిలో మూడు నెలల పాప ప్రమాదవశాత్తు నేలబావిలో పడిపోయింది. ఈ ఘటనతో ఆందోళనకు గురైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు చేపట్టి పాపను రక్షించారు.

సమయస్ఫూర్తితో స్పందించి పసిపాపను కాపాడిన ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. చిన్నారి క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.ప్రమాద సమయంలో వెంటనే స్పందించి పసిపాపను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది సేవలను పలువురు ప్రశంసించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA