Srikakulam: శ్రీకాకుళంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన బాట!
Srikakulam: శ్రీకాకుళంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ, ఉపాధి హామీ జేఏసీ నాయకులు జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
Srikakulam: శ్రీకాకుళంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన బాట!
Srikakulam: రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జి.ధర్మారావు, బి.శ్రీరామ్ రెడ్డి,ఎల్.రవి,పి.కృష్ణారావు, ఎస్.వి. రమణారావు కోరారు.రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారికి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.లవరాజు గారికి యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లు గత 19 సంవత్సరాలుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, వారికి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.h
ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.5,745 మాత్రమే చెల్లిస్తుండగా, కనీస వేతనంగా రూ.26,000 చెల్లించాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, కూలీల హాజరు నమోదు, ప్రభుత్వ ఆదేశాల అమలు వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలుకు ఫీల్డ్ అసిస్టెంట్లే వెన్నెముకగా పనిచేస్తున్నారని, అయినప్పటికీ వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఉద్యోగ భద్రత కల్పించకపోవడం, పదోన్నతులు లేకపోవడం, సామాజిక భద్రతా పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ 5, 2026 నుంచి చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు, కార్మికులకు, ప్రజలకు పిలుపునిచ్చింది.
ప్రధాన డిమాండ్లు ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనంగా నెలకు రూ.26,000 చెల్లించాలి.జూన్ నెల వేతనం ఇవ్వాలి.మాన్ డేస్ విధానాన్ని రద్దు చేయాలి.మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న వారికి FTE హోదా కల్పించి, తదుపరి అర్హతల ఆధారంగా FA హోదాకు పదోన్నతి ఇవ్వాలి.ఫీల్డ్ అసిస్టెంట్లపై ఉన్న పెండింగ్ శాఖాపరమైన చర్యలను ఉపసంహరించాలి.ఉద్యోగ భద్రత కల్పించి ఎక్స్గ్రేషియా మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచాలి.
ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి.ప్రసూతి సెలవులు మరియు ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించాలి.NMMS, Bhuvan యాప్లు, 5G జియోట్యాగింగ్ వంటి అదనపు సాంకేతిక భారం తగ్గించాలి.ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శారద, బి.శ్యామలరావు, మోహన్, భాను, కే.కళ్యాణి, వీ.రాంజీ, చిట్టి. ఆసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.




