Srikakulam: ఎన్నికల వేళ కవ్వింపులు, ఘర్షణలకు తావివ్వొద్దు.. డీఎస్పీ!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కంచిలి పంచాయతీ ఎన్నికల వేళ కవ్వింపులకు, ఘర్షణలకు తావివ్వొద్దని కాశీబుగ్గ డీఎస్పీ జీవీ రమణ హెచ్చరించారు.
Srikakulam: ఎన్నికల వేళ కవ్వింపులు, ఘర్షణలకు తావివ్వొద్దు.. డీఎస్పీ!
Srikakulam: కంచిలి పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ ఆధిపత్య పోరుకు, పరస్పర వివాదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కాశీబుగ్గ డీఎస్పీ జీవీ రమణ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసు శాఖ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కంచిలి మండలంలోని జాడిపూడి, మకరాంపురం, కత్తివరం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలకు లోబడి ప్రచారం నిర్వహించుకోవాలని, రాజకీయ విభేదాలను వ్యక్తిగత వివాదాలుగా మార్చుకోవద్దని హితవు పలికారు.
గ్రామాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సోంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. మంగరాజు, కంచిలి ఎస్సై పి. పారినాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




