Kanchili: కంచిలి: బెల్లుపడ సర్పంచ్ అభ్యర్థిగా రాజేశ్వరి నామినేషన్!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బెల్లుపడ సర్పంచ్ అభ్యర్థిగా దేశెట్టి రాజేశ్వరి సోమవారం ఎంఎస్ పల్లి సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 16 Nov 2026 8:14 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి: బెల్లుపడ సర్పంచ్ అభ్యర్థిగా రాజేశ్వరి నామినేషన్!

కంచిలి: కంచిలి మండలం బెల్లుపడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దేశెట్టి రాజేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. బిన్నలకొత్తూరుకు చెందిన వంశధార జలసాధన కమిటీ సభ్యుడు దేశెట్టి దాలిబందు సతీమణి రాజేశ్వరి సోమవారం ఎంఎస్ పల్లి సచివాలయంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.‌

ఈ సందర్భంగా దేశెట్టి దాలిబందు మాట్లాడుతూ.. బెల్లుపడ గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం మెరుగుపరచడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడం తమ ధ్యేయమని చెప్పారు.

వంశధార జలాలకు ఎప్పుడూ పోరాడిన తాను, గ్రామ రైతుల సమస్యలు తనకు బాగా తెలుసని, రైతులకు నీరు, రైతు భరోసా వంటి పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, మహిళలు, యువత, పెద్దలందరినీ కలుపుకుని పోతామని తెలిపారు.

బెల్లుపడ పంచాయతీ గ్రామ ప్రజలు తమకు అండగా నిలవాలని, ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని రాజేశ్వరి కోరారు. నామినేషన్ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET