Kaviti: తుఫానును లెక్కచేయని కవిటి వైద్య సిబ్బంది సాహసం

Kaviti: కవిటి మండలం మెళియాపుట్టుగలో అర్నాబ్ తుఫాన్ వానను లెక్కచేయకుండా పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలించి కాపాడిన వైద్య సిబ్బంది.

G.RAMBABU, SOMPET
Published on: 29 Oct 2026 8:10 PM IST
Kaviti
X

Kaviti: తుఫానును లెక్కచేయని కవిటి వైద్య సిబ్బంది సాహసం

కవిటి: అర్నాబ్ తుఫాను భీభత్సం సృష్టిస్తున్న వేళ.. కవిటి మండలం మెళియాపుట్టుగ గ్రామంలో ఓ గర్భిణీ స్త్రీకి వైద్య సిబ్బంది పునర్జన్మ ప్రసాదించారు. బుధవారం రాత్రి మెళియాపుట్టుగకు చెందిన గర్భిణీ స్త్రీ జన్ని గీత పురిటి నొప్పులతో బాధపడుతోంది. సమాచారం అందుకున్న స్థానిక పీహెచ్సీ సిబ్బంది ఏఎన్ఎం ఆర్ డిల్లీశ్వరి, ఎంఎల్‌హెచ్‌పీ సుబ్బలక్ష్మి ఏ మాత్రం ఆలస్యం చేయలేదు.

తుఫానును సైతం లెక్కచేయకుండా జోరు వానలోనే గర్భిణీ ఇంటికి వెళ్లారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు చేసి వెంటనే సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో గీత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఏఎన్ఎం డిల్లీశ్వరి తెలిపారు. ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్య సిబ్బంది పనితీరును గ్రామస్థులు, పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కళావతి, ఏఎన్ఎం ఆర్ డిల్లీశ్వరి, ఎంఎల్‌హెచ్‌పీ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET