Srikakulam: వాయుగుండం హెచ్చరిక ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Srikakulam: బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశం. శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తత.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 22 Sept 2026 4:43 PM IST
Srikakulam
X

Srikakulam: వాయుగుండం హెచ్చరిక ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

శ్రీకాకుళం: వాయుగుండం పశ్చిమ మధ్య, దానికి అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం తెలిపారు. ప్రస్తుతం విశాఖకు తూర్పున 320 కి.మీ. దూరంలో, కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 230 కి.మీ. దూరంలో, ఒడిశాలోని గోపాలపురానికి ఆగ్నేయంగా 220 కి.మీ. దూరంలో ఉన్న వాయుగుండం గంటకు 17 కి.మీ. వేగంతో కదులుతున్నది.

ఇదే దిశలో, ఇదే వేగంగా కదిలితే బుధవారం రాత్రికి లేదా గురువారం తెల్లవారుజామున ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల మధ్య ఎక్కడో ఒకచోట తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని, తాజా కదలికలను బట్టి చూస్తే తీవ్ర వాయుగుండం రూపంలోనే తీరం దాటవచ్చని వాతావరణ నిపుణులు అంటున్నారు.

దీని వలన శ్రీకాకుళం జిల్లాలోని కొన్నిచోట్ల కుంభవృష్టి, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయి కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.