Palakonda: తుఫాన్ ప్రభావంతో జలదిగ్బంధంలో పలు గ్రామాలు!

Palakonda: పాలకొండ ప్రాంతంలో ఆర్నబ్ తుఫాన్ బీభత్సం. వోని, గుడివాడ, కోటిపల్లి గ్రామాలకు నిలిచిన రాకపోకలు. నీట మునిగిన లుంబూరు ఎస్సీ కాలనీ.

KAILASH SAHU, PALAKONDA
Published on: 24 Sept 2026 4:47 PM IST
Palakonda
X

Palakonda: తుఫాన్ ప్రభావంతో జలదిగ్బంధంలో పలు గ్రామాలు!

Palakonda: ఆర్నబ్ తుఫాను దాటికి పాలకొండ పట్టణపరిధిలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వోని గ్రామానికి వెళ్తున్న మార్గమధ్యంలో కాజ్ వే వంతెనపైనుండి వరదనీరు ఉదృతంగా ప్రవహించడంతో వోని, గుడివాడ, కోటిపల్లి పలుగ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.

పట్టణానికి రావడానికి ఉన్న ప్రధానరహదారి జలమయం కావడంతో నిత్యావసర సరుకులకు సైతం గ్రామస్తులు అవస్థలుపడుతున్నారు. ప్రవాహాన్ని పరిశీలించేందుకు స్థానిక ఎంపీడిఓ గ్రామ పరిసరాలకు చేరుకొని వరద ఉదృతి తగ్గేంతవరకు ప్రజలు బైటకు రావొద్దని ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్తానని గ్రామస్తులకు తెలిపారు.

మండలంలోని లుంబూరు గ్రామంలో ఎస్సీ కాలనీ పూర్తిగా నీట మునగడంతో కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకొని కాపాడాలని కోరుతున్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA