Kanchili: ఆర్ణబ్ తుపానుతో 1,925 కొబ్బరి చెట్లు నేలమట్టం

Kanchili: కంచిలి మండలంలో ఆర్ణబ్ తుపాను ధాటికి 1,250 మంది రైతులకు చెందిన 1,925 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి; ఉద్యాన శాఖ అధికారులు నష్టాన్ని పరిశీలించారు.

G.RAMBABU, SOMPET
Published on: 29 Oct 2026 6:25 PM IST
Kanchili
X

Kanchili: ఆర్ణబ్ తుపానుతో 1,925 కొబ్బరి చెట్లు నేలమట్టం

కంచిలి: ఆర్ణబ్ తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వీస్తున్న బలమైన ఈదురుగాలులకు కంచిలి మండలంలో కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని తలతంపర, శ్రీరాంపురం, మకరంపురం, కొక్కిలిపుట్టుగ, జాడుపూడి తదితర గ్రామాల్లో సుమారు 1,250 మంది రైతులకు చెందిన 1,925 కొబ్బరి చెట్లు నేలకొరిగినట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

తుపాను ప్రభావంతో దెబ్బతిన్న కొబ్బరి తోటలను ఉద్యాన శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో సందర్శించి, క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించారు. నష్టానికి సంబంధించిన వివరాలను సేకరించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు కంచిలి ఉద్యాన అధికారి మాధవీ లత తెలిపారు. తుపాను ప్రభావంతో కొబ్బరి చెట్లు నేలకొరగడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET