Srikakulam: ఇల్లియాపురంలో సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా మిలియపుట్టి మండలం ఇల్లియాపురం ఆర్‌ఎస్‌కేలో సెంచూరియన్ యూనివర్సిటీ విద్యార్థులు సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Srikakulam: ఇల్లియాపురంలో సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు!
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా మిలియపుట్టి మండలం ఇల్లియాపురం గ్రామ RSK లో Centurion university of technology and management (CUTM) RAWE ప్రోగ్రామ్ విద్యార్థులు BREDS, NABARD ,ఆధ్వర్యంలోని కార్యక్రమం సిబ్బంది సహకారంతో సహజ వ్యవసాయంపై అవగాహన మరియు గ్రామీణ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు సహజ వ్యవసాయ సూత్రాలు, నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ వైవిధ్యం, బయో ఇన్‌పుట్స్, కీటకాలు తెగుళ్ల సమగ్ర యాజమాన్యం (IPM & IDM), బయోగ్యాస్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే ఆవు పేడ, గోమూత్రం, మొక్కల ఆకులు వంటి వనరులతో తక్కువ ఖర్చుతో సహజ వ్యవసాయ ఇన్‌పుట్స్ తయారు చేసుకోవచ్చని వివరించారు.
ప్రత్యేకంగా బీజామృతం, నీమాస్త్రం, పంచగవ్య, బ్రహ్మాస్త్రం, పులటి మజ్జిగ, జిల్లేడు ఆకు కషాయం తదితర కషాయాలు, బయో ఇన్‌పుట్స్ తయారీ విధానం, ఉపయోగాలు మరియు పంటలకు కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. అలాగే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, ట్రైకో కార్డ్స్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ వంటి పర్యావరణహిత కీటక నియంత్రణ పద్ధతులను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, స్థానిక వనరులను వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రైతులకు తెలియజేశారు.
సహజ వ్యవసాయం చేయని కొంతమంది రైతులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని వివిధ సహజ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందారు. కార్యక్రమంలో BREDS , RSK సిబంది పాల్గొన్నారు. గ్రామస్థాయిలో ఇటువంటి ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా రైతులకు సహజ వ్యవసాయంపై ఆచరణాత్మక అవగాహన కల్పించడంతో పాటు, తక్కువ ఖర్చుతో పర్యావరణహితమైన మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా రైతులను ప్రోత్సహించవచ్చని నిర్వాహకులు తెలిపారు.




