Rajam: రాప్తాడు ఘటనపై రాజాంలో చిన్నారుల వినూత్న నిరసన!
Rajam: అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాల ఘటనపై రాజాంలో చిన్నారుల వినూత్న నిరసన. పలకలపై నినాదాలు రాసి బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని, హేమంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Rajam: రాప్తాడు ఘటనపై రాజాంలో చిన్నారుల వినూత్న నిరసన!
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ రాజాంలో చిన్నారులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఇళ్లలోనే పలకలపై నినాదాలు రాసి, వాటిని చేతబట్టి బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
“పుస్తకం పట్టే చేతులకు రక్షణ కావాలి.. మా అక్క కన్నీటికి న్యాయం కావాలి” అంటూ నినాదాలు చేశారు. నిందితుడు హేమంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ అంకుల్‌ను కోరారు. ఆడపిల్లలకు పాఠశాలల్లో, సమాజంలో భద్రత కల్పించాలంటూ చిన్నారులు తమ నిరసన ద్వారా సందేశం ఇచ్చారు.




