Kanchili: బూరగాంలో సీసీ రోడ్డు నిర్మాణం: రైతులకు రాకపోకల ఊరట

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాంలో శివాలయం, పంట పొలాల మార్గంలో రూ.5 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది.

G.RAMBABU, SOMPET
Published on: 19 Sept 2026 3:13 PM IST
Kanchili
X

Kanchili: బూరగాంలో సీసీ రోడ్డు నిర్మాణం: రైతులకు రాకపోకల ఊరట

కంచిలి: మండలంలో బూరగాం పంచాయతీ పరిధిలోని శివాలయం, పంట పొలాలకు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిధుల నుంచి రూ.5 లక్షలతో రహదారిలో కొంత భాగాన్ని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేశారు.

ఆ సమయంలో ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షీ కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి రహదారిని ప్రజలకు అంకితం చేశారు. ఈ రహదారి శివాలయానికి వచ్చే భక్తులతోపాటు పంట పొలాలకు వెళ్లే రైతులకు ఉపయోగకరంగా ఉంటోందని స్థానికులు తెలిపారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయరావు, ఉపాధ్యక్షుడు తలగాన తిరుపతిరావు, ఇప్పిలి కృష్ణారావు, కొనపల సురేష్‌కుమార్, పలికిల జయరాం, మడ్డు వెంకటరావు, మడ్డు వెంకటేశ్వరరావు, మద్దిల భీమరావు, పిల్లల లింగరాజు, మడ్డు అభి యాదవ్, శ్రీకాంత్ గౌడో, బేసి రమేష్, మాస్టీల మన్మథరావు, బొట్టా చిన్నారావు, బుడ్డ షణ్ముఖరావు, గేదెల రామారావు, బద్రి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET