Ichchapuram: ఇచ్ఛాపురం సరిహద్దుల్లో గోవుల అక్రమ రవాణా వాహనం లభ్యం!

Ichchapuram: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం వద్ద గోవుల అక్రమ రవాణా వాహనాన్ని ఒడిశా పోలీసులు, స్థానికులు పట్టుకున్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 17 Oct 2026 12:02 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్ఛాపురం సరిహద్దుల్లో గోవుల అక్రమ రవాణా వాహనం లభ్యం!

Ichchapuram: ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా దిగపొండి ప్రాంతం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరం వాహనాన్ని వెంబడిస్తూ వచ్చిన ఒడిశా పోలీసులు, స్థానికులు సరిహద్దు సమీపంలో గోవుల అక్రమ రవాణా వాహనాన్ని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఒడిశా చీకటి బ్లాక్ మాజీ చైర్‌పర్సన్ నరసింహమూర్తి కోడలు, బీజేపీ మద్దతురాలు వసంతి ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల క్రితం కూడా సరిగ్గా ఇదే ప్రాంతంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకుని ఫిర్యాదు చేశామని ఆమె గుర్తుచేశారు. ఆ సమయంలో కేసు నమోదు చేసినా, తనిఖీలకు వచ్చిన వారి వివరాలు, ఫోన్ నంబర్లు ఇచ్చినా పోలీసులు నిందితులపై సరైన చర్యలు తీసుకోకుండా వాహనాలను విడిచిపెట్టారని ఆరోపించారు.

రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలు సరిగ్గా లేకపోవడంతోనే ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని వాసంతి మండిపడ్డారు. గోవులను కాపాడేందుకు స్థానికులు సహకరిస్తుంటే, పోలీసులు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఎదురుదాడి చేసే ధోరణిలో మాట్లాడటం దారుణమని ఆమె విమర్శించారు. ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, సరిహద్దుల్లో నిఘా పెంచి గోమాతల అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram