Burja: టీడీపీ వీడి వైసీపీలోకి 8 కుటుంబాలు.. కండువాలు కప్పిన ఇన్‌చార్జ్

Burja: బూర్జ మండలం చీడివలసలో టీడీపీకి చెందిన 8 కుటుంబాలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ చింతాడ రవికుమార్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 4 Oct 2026 9:57 PM IST
Burja
X

Burja: టీడీపీ వీడి వైసీపీలోకి 8 కుటుంబాలు.. కండువాలు కప్పిన ఇన్‌చార్జ్

Burja: బూర్జ మండలం చీడివలస పంచాయతీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీగా బలం చేకూరింది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తెలుగుదేశం పార్టీకి చెందిన పండూరి సూరయ్య,దాసరి రమేష్,దాసరి సాయిదుర్గ, ముచ్చు యుగేందర్,పొన్నూరు అప్పారావు, తమ్మిన రామినాయ్డు, చిన్ని శివ,దాసరి రెయ్యన్న మరియు తమ అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎనిమిది కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నియోజకవర్గ ఇంచార్జ్ డా. చింతాడ రవికుమార్ రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.చీడివలస పంచాయతీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ముందుండి కృషి చేసిన బూరి శ్రీరామమూర్తి ని అభినందించారు.

ఈ చేరికలతో చీడివలస పంచాయతీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.

కార్యక్రమంలో బూర్జ మండలపార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు,జెడ్పీటీసి బెజ్జిపురపు రామారావు, మున్సిపల్ ప్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్,మాజీ కౌన్సిలర్ దుంపల శ్యామ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వావిలపల్లి మురళీ, రాష్ట్ర వాలంటీర్ విభాగ కార్యదర్శి అతులూరి రవికాంత్ , అల్లంశెట్టి గిరి , గొలివి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA