Kanchili: కంచిలి మండలం మకరాంపురం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా రమణ స్వామి!

Kanchili: కంచిలి మండలం మకరాంపురం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బెందాళం రమణ స్వామి ఖరారు. ఏకగ్రీవంగా నిర్ణయించిన పార్టీ శ్రేణులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Oct 2026 4:48 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి మండలం మకరాంపురం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా రమణ స్వామి!

Kanchili: కంచిలి మకరాంపురం ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బెందాళం రమణ స్వామి ఖరారయ్యారు. వైసీపీ మండల అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయరావు ఆధ్వర్యంలో మకరాంపురం, చిన్నకొజ్జిరి పంచాయతీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమావేశమై రమణ స్వామి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఖరారు చేశారు. రానున్న ఎన్నికల్లో రమణ స్వామి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తామని ప్రకటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్