Ichchapuram: బహుదా నదికి పోటెత్తిన వరద అప్రమత్తమైన యంత్రాంగం!

Ichchapuram: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఇచ్ఛాపురంలోని బహుదా నదికి వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమై నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 23 Sept 2026 12:41 PM IST
Ichchapuram
X

Ichchapuram: బహుదా నదికి పోటెత్తిన వరద అప్రమత్తమైన యంత్రాంగం!

Ichchapuram: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో బహుదా నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నదీ పరీవాహక ప్రాంత ప్రజలను హెచ్చరిస్తున్నారు.

సోంపేట డిప్యూటీ ఈఈ (DyEE) బుధవారం ఉదయం ఇచ్ఛాపురంలోని బహుదా నది వరద ప్రవాహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం ఉదయం 09:00 గంటల సమయానికి నదిలో 3,125 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో (డిశ్చార్జ్) నమోదైనట్లు ఇచ్ఛాపురం తహశీల్దార్ వెల్లడించారు. ప్రస్తుతం వరద ప్రవాహం సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ, నీటిమట్టం పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పర్యవేక్షణ ముమ్మరం చేశారు.

ప్రమాద హెచ్చరికల వివరాలు మొదటి ప్రమాద హెచ్చరిక: 11.50 అడుగులు (44,342 క్యూసెక్కులు), రెండవ ప్రమాద హెచ్చరిక: 12.50 అడుగులు (51,226 క్యూసెక్కులు), మూడవ ప్రమాద హెచ్చరిక: 13.50 అడుగులు (58,346 క్యూసెక్కులు).

ప్రస్తుతానికి నదిలో ప్రవాహం ప్రమాద స్థాయికి చాలా దిగువనే ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే వినాయక నిమజ్జనం చేసేటప్పుడు గాని నది దాటే ప్రయత్నాలు చేయవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram