Srikakulam: ఇచ్చాపురం వద్ద ఉప్పొంగిన బహుదా: ట్రాఫిక్ జామ్!
Srikakulam: బహుదా నది ఉధృతితో ఇచ్చాపురం వద్ద జాతీయ రహదారిపైకి చేరిన వరద నీటిని, ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Srikakulam: ఇచ్చాపురం వద్ద ఉప్పొంగిన బహుదా: ట్రాఫిక్ జామ్!
Srikakulam: బహుదా వరద ఉధృతితో జాతీయ రహదారిపై నిలిచిన వాహన రాకపోకలు.. జిల్లా ఎస్పీ నిరంతర పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు.
శ్రీకాకుళం. అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతమైన ఒడిశా రాష్ట్రంతో పాటు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బహుదా నదిలో వరద ప్రవాహం ఉధృతమై, ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొజ్జిరియా ( బిళ్ళపాడ) టోల్ గేట్ సమీపంలో జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో ఇరువైపాల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, హైవే పోలీసు అధికారులు, స్థానిక పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ చేస్తు, వరద నీటి ప్రవాహం, రహదారి పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ, ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.వరద పరిస్థితులను బట్టి ఒకేసారి భారీగా వాహనాలను అనుమతించకుండా, రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా, క్రమపద్ధతిలో వాహన రాకపోకలను నియంత్రిస్తున్నారు. హైవే పోలీసు సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటూ వాహనాల రద్దీని పర్యవేక్షించడం, ప్రయాణికులకు అవసరమైన సూచనలు అందించడం, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు.ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు జాతీయ రహదారిపై వాహన రాకపోకలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది.




