Palakonda: పాలకొండలో దళితుల సమస్యలపై ఎస్సీ కమిషన్ గ్రీవెన్స్!
Palakonda: పాలకొండ ఎమ్మార్వో కార్యాలయంలో దళితుల సమస్యలపై ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం గ్రీవెన్స్ నిర్వహణ. వినతులు స్వీకరించి, అధికారులతో సమీక్ష.
Palakonda: పాలకొండలో దళితుల సమస్యలపై ఎస్సీ కమిషన్ గ్రీవెన్స్!
Palakonda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ గౌరవ చైర్మన్ శ్రీ కె.ఎస్. జవహర్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ గౌరవ సభ్యులు శ్రీ రావాడ సీతారాం గారు పాలకొండ ఎమ్మార్వో కార్యాలయంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని దళితులు తమకు ఎదురవుతున్న సమస్యలను, ఇబ్బందులను కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చి, వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన శ్రీ రావాడ సీతారాం గారు వారి సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించారు.
అనంతరం పాలకొండ మండలంలోని అన్ని గ్రామాల వీఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించి, గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై సమీక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మార్వో, ఎంపీడీఓ మరియు కూటమి నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.




