Palakonda: పాలకొండ ఫైర్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ: సిబ్బందికి దోమల తెరల పంపిణీ

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అగ్నిమాపక కేంద్రంలో జిల్లా విపత్తు స్పందన అధికారి పంగ సింహాచలం వార్షిక తనిఖీలు నిర్వహించి, సిబ్బందికి దోమల తెరలు పంపిణీ చేశారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 3 Oct 2026 3:28 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ ఫైర్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ: సిబ్బందికి దోమల తెరల పంపిణీ

Palakonda: అగ్నిమాపక కేంద్రము, పాలకొండ కేంద్ర వార్షిక తనిఖీ లో భాగంగా శ్రీ పంగ సింహాచలము, జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి పార్వతీపురం మన్యం జిల్లా వారి చేతుల మీదుగా పాలకొండ అగ్నిమాపక సిబ్బంది అందరికీ దోమల తెరలను పంపిణీ చేయడమైనది.

నూతన అగ్నిమాపక భవన గోడలకు ఎటువంటి మేకులు కొట్టకుండా ఈ దోమలు తెరలు ఉపయోగించుకోవచ్చు అందువలన గోడలు పాడవకుండా నూతన భవన నిర్వహణ కొరకు వీటిని సిబ్బందికి అందజేయడం అయినది.

వార్షిక తనిఖీలో భాగంగా శ్రీ జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి పార్వతీపురం మన్యం జిల్లా వారు కేంద్ర పరిసరాలను పరిశీలించారు. వాహనములు, పంపులు, ఎక్విప్మెంట్ పనితీరును తనిఖీ చేశారు. అలానే కవాతు, హోజు డ్రిల్, లేడర్ డ్రిల్ లను తీసుకున్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA