Amadalavalasa: సమస్యల పరిష్కారం కోరుతూ మెప్మా ఆర్పీల పోస్ట్‌కార్డు ఉద్యమం

Amadalavalasa: ఆమదాలవలసలో మెప్మా ఆర్పీల సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా శాంతియుత పోస్ట్‌కార్డు కార్యక్రమం నిర్వహించారు.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 2 Oct 2026 10:32 PM IST
Amadalavalasa
X

Amadalavalasa: సమస్యల పరిష్కారం కోరుతూ మెప్మా ఆర్పీల పోస్ట్‌కార్డు ఉద్యమం

ఆమదాలవలస: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) పనిచేస్తున్న మెప్మా రిసోర్స్‌ పర్సన్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న శాంతియుతంగా పోస్ట్‌కార్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.మెప్మా పరిధిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రిసోర్స్‌ పర్సన్స్‌ తమ సమస్యలను ప్రభుత్వానికి నేరుగా తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.అదేవిధంగా విధుల్లో భాగంగా వినియోగిస్తున్న వివిధ యాప్స్‌, ఓటీపీ లకు సంబంధించిన సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, క్షేత్రస్థాయిలో రిసోర్స్‌ పర్సన్స్‌పై ఉన్న అదనపు పనిభారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రతి నెలా జీతాలు సకాలంలో అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. *ప్రజా సంక్షేమంలో ఆర్ పి ల కీలక పాత్ర

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో మెప్మా రిసోర్స్‌ పర్సన్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ప్రజలతో నేరుగా అనుసంధానమై పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, న్యాయమైన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఒక్క ఆర్ పి– ఒక పోస్ట్‌కార్డు… 123 ULBలు – ఒకే విజ్ఞప్తి… మన సమస్యలు – ప్రభుత్వం దృష్టికి!

అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.శాంతియుత ప్రజాస్వామ్య మార్గంలో నిరసన మహాత్మా గాంధీజీ చూపిన శాంతియుత ప్రజాస్వామ్య మార్గాన్ని అనుసరిస్తూ ఈ పోస్ట్‌కార్డు కార్యక్రమాన్ని చేపడుతున్నామని మెప్మా రిసోర్స్‌ పర్సన్స్‌ తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, సమస్యలకు త్వరితగతిన న్యాయమైన పరిష్కారం చూపాలని వారు కోరారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA