Seetampeta: సీతంపేట ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశం నిర్వహణ!
Seetampeta: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో 78వ పాలకవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు పీవో పవార్ స్వప్నిల్ వెల్లడి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Seetampeta: సీతంపేట ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశం నిర్వహణ!
Seetampeta: సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కార్యాలయంలో 78వ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించ ఆనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన సమావేశ వివరాలను వెల్లడించారు.
ఈ సమావేశానికి సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సభ్యులు (శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల కు చెందిన) మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు తెలిపారు.
సమావేశంలో గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వివిధ ఆ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సంబంధిత అంశాలపై చర్చించనున్న నేపథ్యంలో,
సమావేశానికి హాజరయ్యే జిల్లాస్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో, అవసరమైన నివేదికలు, వివరాలతో తప్పనిసరిగా హాజరుకావాలని పీ.వో పవార్ స్వప్నిల్ ప్రకటనలో కోరారు.




