Srikalahasti: చిన్నసింగమల కళ్యాణమండపంలో 237 మద్యం సీసాల స్వాధీనం
Srikalahasti: తొట్టంబేడు మండలం చిన్నసింగమల కళ్యాణమండపంలో అక్రమంగా దాచిన 237 మద్యం సీసాలను శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Srikalahasti: చిన్నసింగమల కళ్యాణమండపంలో 237 మద్యం సీసాల స్వాధీనం
శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం చిన్నసింగమల గ్రామంలోని ఓ కళ్యాణమం డపంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 237 మద్యం సీసాలు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది.
చిన్నసింగమలలోని ఓ కళ్యాణమండపంలో వైసీపీ నాయకులు మద్యం నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో డీఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 180 ఎంఎల్ పరిమాణం కలిగిన 237 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కళ్యాణమండపం వద్ద వాచ్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ సందర్భంగా టూటౌన్ సీఐ నాగరాజు మాట్లాడుతూ.. మద్యం నిల్వ వెనుక ఉన్న అసలు కారణాలు, బాధ్యుల వివరాలను సమగ్ర విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




