Pedda Kojjiriya: 18వసారి మాలధారణ.. అయ్యప్ప భక్తిలో ఆదర్శంగా గురుస్వామి!
Pedda Kojjiriya: 18వసారి మాలధారణ చేసిన గురుస్వామి పాశాల తిరుమలరావు ఆధ్వర్యంలో పెద్ద కొజ్జిరియాలో కన్నెస్వామి పూజా కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది.
Pedda Kojjiriya: 18వసారి మాలధారణ.. అయ్యప్ప భక్తిలో ఆదర్శంగా గురుస్వామి!
Pedda Kojjiriya: అయ్యప్ప స్వామిపై అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో 18వసారి మాలధారణ చేసిన గురుస్వామి పాశాల తిరుమలరావు ఆధ్వర్యంలో పెద్ద కొజ్జిరియా గ్రామంలో కన్నెస్వామి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేకంగా కొబ్బరి మొక్కను తీసుకొచ్చి పూజలు నిర్వహించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సుమారు 500 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఒకచోట చేరి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొజ్జిరియా గురు స్వామి పెంటా శ్రీనివాస శర్మ జంక్షన్ సమీపంలో నిర్వహించిన ఈ వేడుక అయ్యప్ప నామస్మరణలు, భజనలు, భక్తుల శరణుఘోషతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గురుస్వామి పాశాల తిరుమలరావు ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమం భక్తులలో ఐక్యత, ఆధ్యాత్మిక భావనను చాటిచెప్పింది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.




