Yuvraj: వాళ్లిద్దరూ తోపులు.! వన్డేలలో కచ్చితంగా ఆడించాలి: యువరాజ్!
Yuvraj: అభిషేక్, ఇషాన్, వైభవ్‌ను ODI జట్టులోకి రెగ్యులర్‌గా తీసుకోకపోవడం అన్యాయమని యువరాజ్ సింగ్ అన్నారు.
Yuvraj: వాళ్లిద్దరూ తోపులు.! వన్డేలలో కచ్చితంగా ఆడించాలి: యువరాజ్!
Yuvraj: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ వంటి క్రికెటర్లను ODI జట్టులోకి రెగ్యులర్‌గా తీసుకోకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 'మన దగ్గర గొప్ప ఆటగాళ్లున్నారు. వారందరికీ జట్టులో చోటు కల్పించడం కష్టమని తెలుసు. వారి ఆటను బట్టి.. త్వరలో స్క్వాడ్‌లోకి వస్తారని ఆశిస్తున్నా' అని స్పష్టం చేశారు. అభిషేక్ తన హార్డ్‌వర్క్‌తోనే రాణిస్తున్నాడని, క్రెడిట్ మొత్తం అతడిదేనని చెప్పుకొచ్చారు.
యువరాజ్ ప్రస్తావించిన వీరిద్దరూ న్యూజిలాండ్ సిరీస్‌లో చెలరేగుతున్నారు. వెల్లింగ్టన్‌లో అక్టోబర్ 27న జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 198/3 స్కోర్ చేసింది. ఛేజింగ్‌లో అభిషేక్ 38 బంతుల్లో 113 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 45 రన్స్ బాదారు. పవర్‌ప్లేలోనే భారత్ 118/0 స్కోర్ చేసింది. 13.2 ఓవర్లలోనే 199/4తో 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన నాలుగో టీ20లో అభిషేక్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరిన విషయం విదితమే.
ఇక ఇరు జట్ల మధ్య ఐదో టీ20 నవంబర్ 1న హామిల్టన్‌లోని సెడన్ పార్క్‌లో మధ్యాహ్నం 12:30 గంటలకు జరగనుంది. ఇక భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు అని కొందరు అంటుంటే.. వైభవ్ జట్టులోకి తిరిగి వస్తాడని మరికొందరి ఊహాగానాలు.
భారత్ జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్. నితీష్ స్థానంలో శివమ్ దూబే వచ్చే అవకాశం ఉంది. ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ తిరిగి జట్టులోకి రావచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.




