BCCI: టీమిండియా తలుపులు 'స్కై'కి మూసుకున్నట్టే.? తేల్చి చెప్పేశారుగా.!
BCCI: SMATలో రాణిస్తున్నా సూర్య కుమార్ భారత జట్టులోకి రావడం కష్టమేనని BCCI వర్గాలు చెబుతున్నాయి.
BCCI: టీమిండియా తలుపులు 'స్కై'కి మూసుకున్నట్టే.? తేల్చి చెప్పేశారుగా.!
BCCI: భారత క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని BCCI వర్గాలు చెబుతున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో అతను రాణిస్తున్నా, ప్రస్తుతం టీమ్‌లో కాంపిటీషన్ హెవీగా ఉందని పేర్కొన్నాయి. శనివారం ANIతో మాట్లాడిన ఒక BCCI వర్గం, "సూర్య ప్రస్తుతం మా సెలక్షన్ ప్రణాళికల్లో లేడు" అని స్పష్టం చేసింది. ఇప్పటికీ యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్కే పరిమిత ఓవర్ల టీమ్‌లో చోటు కల్పించలేకపోతున్నట్లు వెల్లడించాయి. వైభవ్, అభిషేక్ ఆటతీరుతో అతణ్ని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నాయి.
సూర్య కెప్టెన్సీలో భారత్ 2026 టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ టోర్నీనే అతని చివరి అంతర్జాతీయ టోర్నమెంట్. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో చివరిగా 2026 జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాడు. ఆ తర్వాత టీ20 జట్టు నుంచి అతడిని తప్పించారు. అప్పటి నుంచి అతని పునరాగమనంపై చర్చ జరుగుతూనే ఉంది.
ప్రస్తుత SMAT 2026-27లో సూర్య ముంబై తరఫున అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో 167 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 269.35 కాగా, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. దేశవాళీలో ఈ స్థాయి ప్రదర్శన చేసినా, ప్రస్తుత జట్టు కాంబినేషన్లో అతనికి చోటు కనిపించడం లేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండటం కూడా ఓపెనింగ్ స్థానాల్లో పోటీని పెంచింది.
సెలక్టర్లు సూర్యతో పాటు జైస్వాల్‌ను కూడా ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటంతో అందరినీ జట్టులో ఇమడ్చడం కష్టంగా మారిందని బోర్డు వర్గాలు వివరించాయి. రాబోయే ఐపీఎల్ 2027, దేశవాళీ టోర్నీల్లో సూర్య ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.




