SRH: ట్రావిస్ హెడ్‌తో ఆ స్టార్ ప్లేయర్ రీప్లేస్.? SRHకు 'హోప్' వస్తుందా.!
SRH: ట్రావిస్ హెడ్ గైర్హాజరీలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వెస్టిండీస్ ఓపెనర్ షాయ్ హోప్‌ను తీసుకోవాలని పలువురు ఫ్యాన్స్ కోరుతున్నారు.
SRH: ట్రావిస్ హెడ్‌తో ఆ స్టార్ ప్లేయర్ రీప్లేస్.? SRHకు 'హోప్' వస్తుందా.!
SRH: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూర్పుపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఎస్ఆర్‌హెచ్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్ మొత్తానికి దూరం కావడంతో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీ ఎవరు అనే చర్చ మొదలైంది. గత 3 సీజన్లలో ఈ ఇద్దరూ కలిసి జట్టుకు ఎన్నో అద్భుతమైన ప్రారంభాలను అందించారు.
ట్రావిస్ హెడ్ లోటును భర్తీ చేయడానికి వెస్టిండీస్ ఓపెనర్ షాయ్ హోప్‌ను జట్టులోకి తీసుకోవాలని పలువురు ఫ్యాన్స్ గట్టిగా కోరుతున్నారు. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో షాయ్ హోప్ అత్యద్భుతంగా రాణించాడని వారు గుర్తు చేస్తున్నారు. ఆయన ప్రదర్శన జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అభిమానులు భావిస్తున్నారు.
మరికొందరైతే ఆస్ట్రేలియా ఆటగాడు ఫ్రైజర్ మెక్‌గర్క్ పేరును కూడా సూచిస్తున్నారు. యువ ఆటగాడిగా దూకుడుగా ఆడే మెక్‌గర్క్ అయితే అభిషేక్ శర్మకు సరైన జోడీ అవుతాడని కొందరు క్రికెట్ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఓపెనింగ్ స్థానం కోసం మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గత సీజన్లలో అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టించిన ఎస్ఆర్‌హెచ్ ఓపెనింగ్ జోడీ స్థానాన్ని భర్తీ చేయడం మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. జట్టు సమతుల్యతను దెబ్బతీయకుండా సరైన ఆటగాడిని ఎంపిక చేయడంపై ఫ్రాంచైజీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.




