ఒకట్రెండు కాదు భయ్యో.. ఏకంగా ఆరు సెంచరీలు.. క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి..!
Six ODI Centuries Single Day: ఒకే రోజులో ఆరు వన్డే సెంచరీలు.. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి దృశ్యం ఇప్పటివరకు కనిపించలేదు. మూడు వేర్వేరు మ్యాచ్‌ల్లో ఆరుగురు బ్యాటర్లు శతకాలతో మెరిశారు.
ఒకట్రెండు కాదు భయ్యో.. ఏకంగా ఆరు సెంచరీలు.. క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి..!
Six ODI Centuries Single Day: వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. సెప్టెంబర్ 27, 2026న జరిగిన మూడు వేర్వేరు వన్డే మ్యాచ్‌ల్లో ఆరు సెంచరీలు వచ్చాయి. ఒకే రోజులో ఆరు శతకాలు నమోదవడం ఇదే తొలిసారి. గతంలో ఒక రోజులో ఐదు సెంచరీలు నమోదైన సందర్భాలు ఆరు సార్లు ఉన్నాయి. ఈసారి విరాట్ కోహ్లీ (Virat Kohli), శుభ్‌మన్ గిల్ (Shubman Gill), జస్టిన్ గ్రీవ్స్ (Justin Greaves), టెంబా బవుమా (Temba Bavuma), డేవిడ్ మిల్లర్ (David Miller), టామ్ బాంటన్ (Tom Banton) ఈ చారిత్రక జాబితాలో నిలిచారు. భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌లో కోహ్లీ, గిల్ శతకాలతో మెరిశారు. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా పోరులో బవుమా, మిల్లర్ భారీ స్కోర్లు సాధించారు. ఇంగ్లాండ్-శ్రీలంక మ్యాచ్‌లో బాంటన్ సెంచరీ కొట్టగా, వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు.
కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్..
భారత క్రికెట్ జట్టు (Team India) తరఫున విరాట్ కోహ్లీ అజేయంగా 139 పరుగులు చేశాడు. కేవలం 88 బంతుల్లోనే ఈ స్కోరు సాధించిన అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఒక వన్డే ఇన్నింగ్స్‌లో కోహ్లీ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. ఈ శతకంతో అతడి వన్డే సెంచరీల సంఖ్య 55కు చేరింది. అంతర్జాతీయ శతకాల సంఖ్య 86గా నమోదైంది. వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో ఆటగాడిగా, ఆ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్‌గా కూడా నిలిచాడు.
గిల్‌కు మరో మైలురాయి..
శుభ్‌మన్ గిల్ 108 బంతుల్లో 110 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌పై తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఈ ఇన్నింగ్స్ కీలకంగా నిలిచింది. ఈ శతకంతో గిల్ వన్డేల్లో 3,000 పరుగుల మార్కును దాటాడు.
మిల్లర్ భారీ సెంచరీ..
దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఆస్ట్రేలియాపై 93 బంతుల్లో 142 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్లో అత్యుత్తమ వన్డే స్కోరు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో టెంబా బవుమా 116 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. వీరిద్దరి శతకాలతో దక్షిణాఫ్రికా 365/9 స్కోరు చేసింది.
బాంటన్, గ్రీవ్స్ తొలి శతకాలు..
ఇంగ్లాండ్ బ్యాటర్ టామ్ బాంటన్ 105 బంతుల్లో 126 పరుగులు చేసి తొలి వన్డే సెంచరీ అందుకున్నాడు. అతడి స్కోరులో 16 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ 355/7 సాధించింది.
వెస్టిండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ 108 బంతుల్లో 101 పరుగులు చేశాడు. 12 బౌండరీలతో తన తొలి వన్డే శతకాన్ని పూర్తి చేశాడు. వెస్టిండీస్ 295/7 సాధించడంతో ఆరు శతకాల అరుదైన రోజు పూర్తయింది.




