Mumbai Indians: ముంబై నెక్స్ట్ కెప్టెన్ మన తెలుగోడేనా.? ఆసక్తికర విషయాలు ఇవిగో!

Mumbai Indians: తెలుగు కుర్రాడు తిలక్ వర్మను కెప్టెన్ చేసేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.

Ravi
By Ravi
Published on: 20 Oct 2026 6:14 PM IST
Mumbai Indians
X

Mumbai Indians: ముంబై నెక్స్ట్ కెప్టెన్ మన తెలుగోడేనా.? ఆసక్తికర విషయాలు ఇవిగో!

Mumbai Indians: ఐపీఎల్ ఫ్రాంచైజీల నాయకత్వ మార్పులు అలాగే కెప్టెన్ల ఎంపికపై ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రముఖ జట్ల తరుఫున ఆడే ఆటగాళ్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న తరుణంలో వెలువడే వార్తలు క్రీడా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించి వస్తున్న తాజా వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం తెలుగు కుర్రాడు తిలక్ వర్మను కెప్టెన్ చేసేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆ ఫ్రాంచైజీ వర్గాలపై వరుస పోస్టులు చేయడమే దీనికి సంకేతమని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో జట్టుకు వెళ్లే అవకాశం ఉండటంతో తిలక్ వర్మ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందుతోంది. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జరగగా ముంబై ఖండించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ఈ మార్పులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందేనని ట్రేడ్ వర్గాలు వివరిస్తున్నాయి. జట్టు భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాబోయే సీజన్‌లో ముంబై జట్టును ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్ మెగా వేలం 2027 నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.