Kumar Sangakkara: విదేశీ గడ్డపై శ్రీలంక దిగ్గజం సంగక్కరకు పరాభవం.. ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై సంచలన ఆరోపణలు!

Kumar Sangakkara: ఐర్లాండ్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు తీవ్ర పరాభవం. ర్యాన్‌ఎయిర్ సిబ్బంది తన కుటుంబంపై వివక్ష చూపారంటూ సంచలన పోస్ట్.

Arun Chilukuri
Published on: 29 Oct 2026 1:07 PM IST
Kumar Sangakkara
X

Kumar Sangakkara: విదేశీ గడ్డపై శ్రీలంక దిగ్గజం సంగక్కరకు పరాభవం.. ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై సంచలన ఆరోపణలు!

Kumar Sangakkara: శ్రీలంక క్రీడా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మాజీ కెప్టెన్, ప్రపంచ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార సంగక్కరకు విదేశాల్లో ఊహించని తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రఖ్యాత 'ర్యాన్‌ఎయిర్' విమానయాన సంస్థ సిబ్బంది తనతో పాటు తన కుటుంబం పట్ల తీవ్ర వివక్షపూరితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు.

తన కుటుంబానికి ఎదురైన అవమానకర పరిస్థితిని వివరిస్తూ సంగక్కర సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. "డబ్లిన్‌లోని ర్యాన్‌ఎయిర్ గేట్ సిబ్బంది నుంచి ఎవరైనా ఇలాంటి వివక్షపూరిత ప్రవర్తనను ఎదుర్కొన్నారా? నాకు, నా కుటుంబానికి ఇప్పుడే అలాంటి చేదు పరిస్థితి తలెత్తింది. ఆ ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సిబ్బంది మాట్లాడిన తీరు, ప్రామాణిక నియమాలను పాటించకపోవడం, బెదిరింపు ధోరణి ప్రదర్శించడం ఏ ప్రయాణికుడికీ ఆమోదయోగ్యం కాదు. డబ్లిన్ నగరంలో మాకు ఎదురైన మొదటి దారుణ అనుభవం ఇది." అని కుమార సంగక్కర ట్వీట్ చేసారు.

సంగక్కర చేసిన పోస్టు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ 'డబ్ల్యూఎస్‌ఓ2' (WSO2) సీఈవో సంజీవ వీరవరణ దీనిపై స్పందిస్తూ.. "పాశ్చాత్య దేశాల్లో ఈ విధమైన వివక్ష ఒక భాగమైపోయింది" అని వ్యాఖ్యానించారు. దీనికి సంగక్కర సమాధానమిస్తూ.. "ఆ వివక్షను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నప్పుడు కలిగే అనుభవం చాలా దారుణంగా ఉంటుంది" అని సమాధానమిచ్చారు.

యూరప్‌లోనే అత్యంత భారీ ఎయిర్‌లైన్‌గా గుర్తింపు పొందిన 'ర్యాన్‌ఎయిర్' సిబ్బంది, ఒక అంతర్జాతీయ క్రీడా దిగ్గజం మరియు వారి కుటుంబం పట్ల ఇలా ప్రవర్తించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.