Irfan Pathan: భువీని తీసుకొని తప్పు చేశారు.. ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి!
Irfan Pathan: NZతో టీ20 సిరీస్‌లో భువనేశ్వర్‌ను ఆడించడం తప్పని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు, భువీ 4 మ్యాచుల్లో 1 వికెట్ మాత్రమే తీశాడని గుర్తు చేశాడు.
Irfan Pathan: భువీని తీసుకొని తప్పు చేశారు.. ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి!
Irfan Pathan: NZతో టీ20 సిరీస్‌లో భువనేశ్వర్‌ను ఆడించడంపై మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆయన, 'భువీని తీసుకొని సెలక్టర్లు తప్పు చేశారు. ఆయన మంచి బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పట్లో టీ20 ప్రపంచకప్ కూడా లేదు. అయినా ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదు. దీనివల్ల మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ లాంటి యంగ్ బౌలర్లకు NZ కండీషన్లలో అన్ని మ్యాచులు ఆడే ఛాన్స్ దక్కలేదు' అని అభిప్రాయపడ్డారు.
ఈ సిరీస్‌లో 36 ఏళ్ల భువనేశ్వర్ ప్రదర్శన ఇలా ఉంది. మొదటి టీ20లో 4 ఓవర్లలో 49 పరుగులిచ్చి వికెట్ తీయలేదు. రెండో టీ20లో 4 ఓవర్లలో 50 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు. మూడో టీ20లో 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి వికెట్ దక్కలేదు. ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో ఆయన స్థానంలో మయాంక్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. హామిల్టన్‌లో జరిగిన ఐదో టీ20లో భువీ 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయారు. మొదటి 3 ఓవర్లలోనే 31 పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా 4 మ్యాచుల్లో 16 ఓవర్లలో 180 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశారు. ఎకానమీ 11.25గా నమోదైంది.




