IPL 2027: రూ. 20 కోట్ల ఇద్దరు స్టార్ ప్లేయర్స్ రిలీజ్.? ఆ ఒక్క జట్టు మాత్రం ఎవరినీ వదలదట!

IPL 2027: ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు నవంబర్ 17కు దగ్గరపడుతున్న వేళ, రూ. 25.20 కోట్ల కామెరాన్ గ్రీన్, రూ. 21 కోట్ల నికోలస్ పూరన్ రిలీజ్ కావచ్చని, డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ ఎవరినీ వదులుకోదని చతేశ్వర్ పుజారా అంచనా వేశారు.

Ravi
By Ravi
Published on: 8 Nov 2026 6:44 PM IST
IPL 2027
X

IPL 2027: రూ. 20 కోట్ల ఇద్దరు స్టార్ ప్లేయర్స్ రిలీజ్.? ఆ ఒక్క జట్టు మాత్రం ఎవరినీ వదలదట!

IPL 2027: ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు నవంబర్ 17కు వారం రోజులకు పైగా సమయమే ఉంది. ఈ సమయంలో ఫ్రాంచైజీలు ఎవరిని కొనసాగించాలి, ఎవరిని వదిలేయాలనే దానిపై ఆలోచనలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్ల నుంచి రిలీజ్ కావడానికి అవకాశం ఉన్న పెద్ద ప్లేయర్ల గురించి భారత మాజీ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా తన అంచనాలు చెప్పారు. రూ. 20 కోట్లు దాటిన ధర ఉన్న ఇద్దరు స్టార్లు రిలీజ్ కావచ్చని ఆయన అన్నారు.

ఇప్పటికే చాలా ట్రేడ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనది హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లడం, బదులుగా అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు రావడం. ఈ స్వాప్‌కు రెండు ఫ్రాంచైజీలు అంగీకరించాయని, కాగితాలు సమర్పించాయని, బీసీసీఐ ఆమోదం, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలాయని రిపోర్టులు చెబుతున్నాయి. పుజారా ముంబై నుంచి హార్దిక్ రిలీజ్ కావచ్చని కూడా అంచనా వేశారు. ఆయన అంచనా చెప్పిన తర్వాత ఈ ట్రేడ్ ఖరారైనట్లు వార్తలు వచ్చాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి కామెరాన్ గ్రీన్‌ను పుజారా ఎంచుకున్నారు. ఐపీఎల్ 2026 వేలంలో గ్రీన్‌ను కేకేఆర్ రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ కొనుగోలు. 'వేలంలో వారు మళ్లీ ఆయనను తిరిగి కొనుక్కోవచ్చు' అని పుజారా అన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ తమ రూ. 21 కోట్ల స్టార్ నికోలస్ పూరన్‌ను రిలీజ్ చేయవచ్చని కూడా ఆయన చెప్పారు. అయితే పూరన్‌ను కొనసాగించాలని ఎల్‌ఎస్‌జీ నిర్ణయిస్తే, ఆయుష్ బదోనిని వదిలేయవచ్చని పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఎంపిక మ్యాట్ హెన్రీ, మాథ్యూ షార్ట్ మధ్య ఉండవచ్చని పుజారా చెప్పారు.

గుజరాత్ టైటాన్స్ విషయంలో రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లలో ఒకరిని వదిలేయవచ్చని, ఇద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేదని అన్నారు. పంజాబ్ కింగ్స్ నుంచి జేవియర్ బార్ట్‌లెట్ లేదా లాకీ ఫెర్గూసన్ రిలీజ్ కావచ్చని ఆయన అంచనా. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి కూడా ఇద్దరు బౌలర్లను ఎంచుకున్నారు. జయదేవ్ ఉనద్కత్ లేదా హర్షల్ పటేల్‌లో ఒకరిని ఎస్‌ఆర్‌హెచ్ వదులుకోవచ్చని ఆయన భావించారు.

పృథ్వీ షా, కరుణ్ నాయర్‌లలో ఒకరిని ఆయా ఫ్రాంచైజీ వదిలేయవచ్చని పుజారా అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ రాయల్స్ ఎవరిని రిలీజ్ చేస్తుందో ఆయన స్పష్టంగా చెప్పలేకపోయారు. అయితే ఆ జట్టు తమ భారతీయ ఆటగాళ్లలో ఒకరిని వదులుకోవచ్చని అన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్లు కాబట్టి ఆ జట్టు ఎవరినీ రిలీజ్ చేయకపోవచ్చన్నది తన అంచనా అని పుజారా చెప్పారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.