పాక్‌పై భారత కుర్రాళ్ల రచ్చ.. సంబరాలకు బీసీసీఐ ఫుల్ సపోర్ట్
India U19 Players: ఒమన్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి భారత యువ జట్టు అద్భుత విజయం సాధించింది.
పాక్‌పై భారత కుర్రాళ్ల రచ్చ.. సంబరాలకు బీసీసీఐ ఫుల్ సపోర్ట్
India U19 Players: ఒమన్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి భారత యువ జట్టు అద్భుత విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరులో కేవలం ఒక్క వికెట్ తేడాతో గెలుపొందిన భారత్, గత ఏడాది ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు తొమ్మిదోసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు ప్రదర్శించిన దూకుడు సంబరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, బీసీసీఐ మాత్రం యువ ఆటగాళ్లకు బహిరంగంగా మద్దతుగా నిలిచింది.
అఖరి బంతి వరకు హోరాహోరీ.. చివర్లో మెరిసిన మోహిత్, మనల్
ఈ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు ఒక దశలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఈ క్లిష్ట సమయంలో మనల్ చౌహాన్ (32 బంతుల్లో 47 పరుగులు), మోహిత్ ఉల్వా (26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు) అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. గెలవడానికి చివరి బంతికి ఒక ఫోర్ అవసరమైన తరుణంలో మోహిత్ ఉల్వా బౌండరీ బాది భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఆటగాళ్ల సంబరాలపై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
అద్భుత విజయం తర్వాత భారత ఆటగాళ్లు మైదానంలోకి దూసుకెళ్లి ఉద్వేగభరితంగా సంబరాలు చేసుకున్నారు. అయితే కొంతమంది ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్ల వైపు కొన్ని సంజ్ఞలు చేయడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. ప్రత్యర్థి జట్టు ముందు ఇలా సంబరాలు చేసుకోవడంపై చర్చ చెలరేగినప్పటికీ, బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా స్పందిస్తూ ఆటగాళ్లను గట్టిగా సమర్థించారు. ఇంతటి కష్టతరమైన పరిస్థితి నుంచి మ్యాచ్ గెలిచినప్పుడు యువ ఆటగాళ్లకు తమ భావోద్వేగాలను వ్యక్తపరిచే పూర్తి హక్కు ఉంటుందని, ఇది వారి పోరాట స్ఫూర్తిని, ఓటమిని అంగీకరించని ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పLని ఆయన స్పష్టం చేశారు.
రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ కైవసం
అండర్-19 ఆసియా కప్ చరిత్రలో భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఇప్పటివరకు భారత్ 1989, 2003, 2012 (సంయుక్త విజేతలు), 2013-14, 2016, 2018, 2019, , 2021 సంవత్సరాలలో ఈ ట్రోఫీని గెలుచుకోగా, తాజాగా ఈ విజయంతో ఐదేళ్ల తర్వాత వరుసగా రెండో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు పాకిస్థాన్ మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.




