IND Vs NZ: టీమ్‌ఇండియా ఓటమికి కారణమిదేనా.? ఈజీ క్యాచ్ వదిలేశారు కదరా.!
IND Vs NZ: NZతో 5వ T20లో నమన్ ధీర్ క్యాచ్ వదిలేయడంతో సీఫర్ట్ చెలరేగి 93 పరుగులు చేయడమే కాదు.. NZ 7 వికెట్ల తేడాతో చివరి టీ20లో విజయం సాధించింది.
IND Vs NZ: టీమ్‌ఇండియా ఓటమికి కారణమిదేనా.? ఈజీ క్యాచ్ వదిలేశారు కదరా.!
IND Vs NZ: NZతో జరిగిన 5వ T20లో టీమ్‌ఇండియా ఓటమికి సీఫర్ట్ ఇచ్చిన క్యాచ్‌ను వదలడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అర్ష్‌దీప్ వేసిన నాలుగో ఓవర్‌లో ఆఫ్ సైడ్ మీదుగా బౌండరీ కొట్టడానికి సీఫర్ట్ ప్రయత్నించారు. బాల్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లోకి గాల్లోకి లేవగా నమన్ ధీర్ ఈజీ క్యాచ్‌ను నేల పాలు చేశారు. అప్పటికి సీఫర్ట్ 15 బంతుల్లో 13 పరుగులే చేశారు. ఆ తర్వాత చెలరేగిన సీఫర్ట్ ఆ క్యాచ్ తర్వాత 35 బంతుల్లో 80 పరుగులు బాదారు. చివరికి 50 బంతుల్లో 93 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యారు. ఇందులో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
హామిల్టన్‌లోని సెడన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన NZ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 191/8 స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 61 పరుగులతో చెలరేగగా, శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 50 రన్స్ చేశారు. నమన్ ధీర్ 33 పరుగులు చేశారు. వీరు చెలరేగి ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది.
ఛేజింగ్‌లో సీఫర్ట్‌కు తోడు గ్లెన్ ఫిలిప్స్ 38 బంతుల్లో 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో NZ 17.4 ఓవర్లలోనే 195/3 స్కోర్ చేసి 7 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. ఈ సిరీస్‌లో ఫిలిప్స్ రికార్డు స్థాయిలో 341 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, సిరీస్‌లో NZ ఫీల్డర్లు 15 క్యాచ్‌లు వదిలేయగా, భారత్ 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.




