Ben Stokes: నిబంధనలను ఉల్లంఘించిన బెన్ స్టోక్స్.. ఐసీసీ కీలక నిర్ణయం!
Ben Stokes: ICC Takes Key Decision on ECB. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం.
Ben Stokes: నిబంధనలను ఉల్లంఘించిన బెన్ స్టోక్స్.. ఐసీసీ కీలక నిర్ణయం!
Ben Stokes: ఇంగ్లండ్ మాజీ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అయితే స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన వీడియోపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టెస్టు నాలుగో రోజు ఆటకు ముందు బెన్ స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని తన ఇంగ్లండ్ సహచరులకు వెల్లడించాడు. ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో స్టోక్స్ మాట్లాడిన వీడియోను చిత్రీకరించారు. మ్యాచ్ కొనసాగుతుండగా, స్టోక్స్ కూడా మ్యాచ్‌లో ఆడుతుండగానే.. టీ విరామానికి ముందు ఆ వీడియోను ఈసీబీ తమ అధికారిక సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే సందేహాలు తలెత్తాయి.
అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులకు కేటాయించిన ఏరియాలకు (పీఎంఓఏ) సంబంధించి ఐసీసీ ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది. వీటిని ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియాస్ ప్రమాణాలుగా పేర్కొంటారు. మ్యాచ్ సమగ్రతను కాపాడటంతో పాటు అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను ఐసీసీ రూపొందించింది. పీఎంఓఏ ప్రమాణాల్లోని ఆర్టికల్ 2.2.11 ప్రకారం.. జట్లు ఉపయోగించే డ్రెస్సింగ్ రూమ్‌లలో వీడియో లేదా ఆడియోను రికార్డు చేయకుండా కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయకుండా క్రికెట్ బోర్డులు చర్యలు తీసుకోవాలి. అయితే బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వీడియో మ్యాచ్ ముగియకముందే బయటకు వచ్చింది. ఈ వీడియోపై ఈసీబీని ఐసీసీ వివరణ కోరింది.
ఈ వ్యవహారంపై ఐసీసీ విచారణ ముగిసిందని ఓ అంతర్జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఈసీబీపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఐసీసీ లేదా ఈసీబీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అంతకుముందు ఐసీసీ తన రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి లేఖ రాసిందనే వార్తలపై బెన్ స్టోక్స్ సరదాగా స్పందించాడు. ‘Sack him...’ (అతడిపై వేటు వేయండి )అంటూ రెండు పదాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ 160 పరుగుల తేడాతో విజయం సాధించి.. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
బెన్ స్టోక్స్ 15 ఏళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు సేవలందించాడు. 2011లో వైట్-బాల్ క్రికెట్‌లో, 2013 యాషెస్ సిరీస్‌లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 122 టెస్టులు ఆడాడు. అందులో 44 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికాపై చేసిన 258 పరుగులు అతడి టెస్ట్ కెరీర్‌లో అత్యధికం. 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 84 పరుగుల ఇన్నింగ్స్, యాషెస్ టెస్టులో 135 ఇన్నింగ్స్ స్టోక్స్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచాయి. అలానే 2022 టీ20 ప్రపంచ కప్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు.




