Lord Krishna: విద్యార్థులకు అపజయాన్ని ఇచ్చే శ్రీకృష్ణుడు...రోజూ ఇలా నమస్కరించండి చాలు
విద్యార్థులు విద్యలో రాణించాలంటే ప్రతిరోజూ శ్రీకృష్ణ భగవానుడికి ఈ విధంగా ఒక్క నమస్కారం చేయండి చాలు. మీరు చేపట్టిన అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు.
Lord Krishna: సనాతన హిందూ ధర్మంలో భగవంతునికి, గురువులకు, పెద్దలకు నమస్కరించడం వెనుక పరమ పవిత్రమైన అంతరార్థం దాగి ఉంది. నమస్కారం అంటే కేవలం చేతులు జోడించడం కాదు.. "నాలోని అహంకారాన్ని నీ పాదాల చెంత వదిలేస్తున్నాను, నేను నీకు దాసుడిని" అని ప్రకటించడం. ఆధ్యాత్మిక పండితుల చెప్పిన దానిప్రకారం, జగద్గురువైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నిత్యం భక్తితో చేసే ఒక్క నమస్కారం.. మనిషి జీవితంలో ఊహించని అద్భుతాలను, విజయాలను తీసుకువస్తుంది. చదువుకునే విద్యార్థులకు అపజయం అనేదే లేకుండా మేధోశక్తిని పెంచడానికి, నిత్య జీవితంలో సుఖశాంతులు పెంపొందడానికి కృష్ణ నామస్మరణ ఎంతో దోహదపడుతుంది.
నమస్కార మహిమ ... శాస్త్రాలు చెబుతున్నసత్యాలు
మన ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం, నిత్యం శ్రీకృష్ణుని స్మరిస్తూ ప్రణామం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి. వేల సంఖ్యలో అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత ఆచరించే అత్యంత పవిత్రమైన స్నానాన్ని 'అవభృథ స్నానం' అంటారు. ఇది కొన్ని కోట్ల జన్మల పాపాలను కడిగేస్తుంది. అయితే, శ్రీకృష్ణుడికి మనస్ఫూర్తిగా చేసే ఒక్క నమస్కారం అంతటి మహత్కార్యంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, నమస్కారం చేయడం వల్ల మనిషిలో దాగి ఉన్న రాజస, తామస గుణాలు నశించి, సాత్విక భావం పెంపొందుతుంది. ఇది విద్యార్థులలో ఏకాగ్రతను 100 శాతం పెంచుతుంది. ఉదయాన్నే మీ దైనందిన కార్యక్రమాలను ప్రారంభించే ముందు రాధాకృష్ణులకు నమస్కరించుకుంటే, ఆ రోజంతా ఎలాంటి విఘ్నాలు కలగకుండా భగవంతుడే రక్షణగా నిలుస్తాడు.
వినయం వెంటే విజయం
కృష్ణం వందే జగద్గురుమ్ అంటారు. అంటే ఏమంటే... ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే తన అహాన్ని పక్కన పెట్టి దైవానికి, పెద్దలకు నిత్యం ప్రణామం చేస్తాడో, అతనికి జీవితంలో ఎన్నటికీ అపజయం ఎదురుకాదు. భగవద్గీతను బోధించిన ఆ కృష్ణ పరమాత్మకు నిత్యం మీ పూజా మందిరంలో తలవంచి నమస్కరించండి. అది మీ అంతరంగంలోని చీకట్లను తొలగించి, ఆధ్యాత్మిక పురోగతి వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులను విజయతీరాలవైపు నడిపించడంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సదా తోడు ఉంటాడు. కుచేలుడిలా వినయంగా ఉంటే చాలు.




