Om Chanting Benefits: ఓంకారంతో జీవితం మారిపోతుందా...పెద్దలు చెప్పిన రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు
ప్రతిరోజూ ఉదయాన్నే ఓంకారం జపించడం వలన శారీరక, ఆధ్యాత్మికంగా పలు ప్రయోజనాలు కలుగుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత లభిస్తుంది.
Om Chanting Benefits: విశ్వంలో వినిపించే అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన నాదం ‘ఓంకారం’. సృష్టిలోని సమస్త శబ్దాలకు, వేద మంత్రాలకు మూలాధారం ఈ ప్రణవ నాదమే. రోజూ ఉదయాన్నే క్రమం తప్పకుండా శాస్త్రబద్ధంగా ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల కేవలం ఆధ్యాత్మిక ఉన్నతే కాదు, శారీరక, మానసిక అనారోగ్యాలు సైతం మాయమై జీవితం పూర్తిగా మారిపోతుందని మన పెద్దలు, యోగులు చెబుతున్నారు. ఓం అనే శబ్దం వెనుక దాగి ఉన్న ఆ బ్రహ్మ రహస్యం, దాని వెనుక ఉన్న వైజ్ఞానిక సత్యాలను ఇక్కడ తెలుసుకుందాం.
'అ, ఉ, మ్' - త్రిమూర్తుల స్వరూపం
ఓంకారం అనేది కేవలం ఒక అక్షరం కాదు. అది మూడు అక్షరాల సమ్మేళనం. ఇందులో మొదటిది అ. అ అని పలికినపుడు ఆ శబ్ధం నాభి భాగం నుంచి వస్తుంది. ఇది సృష్టికర్త బ్రహ్మదేవునికి ప్రతీక. ఇక ఉ అనే పదం హృదయభాగం నుంచి ఉద్బవిస్తంది. ఇది స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రతీక. మూడో అక్షరం మ్... గొంతు కంఠం నుంచి వస్తుంది. ఇది లయకారుడు ఆ పరమేశ్వరుడికి ప్రతీక. ఈ మూడు శబ్దాలు కలిసినప్పుడు శరీరంలోని అంతర్గత అవయవాలలో ఒక అద్భుతమైన కంపనం మొదలవుతుంది. ఇది మన శరీరంలో నిద్రిస్తున్న షట్ చక్రాలను నిద్రలేపి, ఉత్తేజపరుస్తుంది.
ఓంకార జప విధానం
ఓంకారాన్ని ఎలా పడితే అలా కాకుండా, ఒక పద్ధతి ప్రకారం జపించాలి. ఉదయం సూర్యోదయ సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయ వేళ ప్రశాంతమైన చోట కూర్చోవాలి. పద్మాసనం లేదా వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. ఏ ఆసనంలో కూర్చొన్నా వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి. మీ సమయాన్ని బట్టి రోజూ కనీసం 5,7,11,21 లేదా 108 సార్లు ఓంకారాన్ని దీర్ఘంగా జపించాలి. ఇలా చేయడం వలన శరీరంలోని అంతర్గత అవయవాలు శుద్ధి అవుతాయి.
ఓం అని ఉచ్చరించేటప్పుడు మెదడులోని నరాలు ప్రశాంతపడతాయి. ఇది ఒత్తిడిని తగ్గించే ఒక దివ్యౌషధం ఓంకారం. అంతేకాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతాయి. రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. గుండె జబ్బులు దరిచేరవు. జీర్ణక్రియ రేటు అదుపులోకి వస్తుంది. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే...మనసులోని ప్రతికూల ఆలోచనలు నశించి, ఇల్లంతా సానుకూల శక్తితో నిండిపోతుంది.
భగవంతుడిని చేరుకోవడానికి కఠినమైన పూజలు చేయలేకపోయినా, పరమశివుని స్వరూపమైన ఈ ప్రణవ నాదాన్ని నిత్యం స్మరిస్తే చాలు. ఆ శబ్ద తరంగాలు మీ గుండెల్లో ధైర్యాన్ని, ముఖంలో తేజస్సును నింపుతాయి. ఈ రోజు నుంచే మీ ఉదయాన్ని ఓంకారంతో ప్రారంభించి, మీ జీవితంలో వచ్చే మార్పును గమనించండి.




