Mangalsutra: మహిళలకు మన పూర్వీకులు చెప్పిన అత్యంత గోప్యమైన తాళి రహస్యం
మంగళసూత్రం కేవలం ధారణ ఆభరణం మాత్రమే కాదు...దాని వెనుక మన పూర్వీకులు ఎన్నో రహస్యాలను దాచి ఉంచారు. అవేంటో తెలుసుకుందాం.
Mangalsutra: హైందవ సంప్రదాయంలో వివాహిత స్త్రీని ‘సువాసిని’గా, ‘ముత్తైదువు’గా నిలబెట్టే అత్యంత పవిత్రమైన ఆభరణం మంగళసూత్రం. దీనినే తిరుమాంగళ్యం అని కూడా పిలుస్తారు. పెళ్లి వేదికపై వేద మంత్రాల సాక్షిగా, పురోహితులు నిర్ణయించిన సుముహూర్తానికి వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఈ తాళిని కడతాడు. కేవలం ఒక పసుపు తాడు, రెండు సూత్రాలు కలిగిన ఈ మంగళసూత్రం వెనుక మన పూర్వీకులు దాచిన ఒక పరమ రహస్యం, గొప్ప వైజ్ఞానిక సత్యం ఉంది. ఆ రహస్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాళి వెనుక ఉన్న రహస్యాలు
సాధారణంగా మంగళసూత్రం భర్త ఆయుష్షుకోసం, భర్త నిండునూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ధరిస్తారు. కానీ, పూర్వీకులు దీనిని స్త్రీ ఆరోగ్య రక్షణ కవచంగా రూపొందించారు. శాస్త్రాల ప్రకారం, మంగళసూత్రంలోని రెండు తాళి బొట్లు నేరుగా స్త్రీ హృదయ స్థానాన్ని అంటే అనాహత చక్రాన్ని తాకుతూ ఉంటాయి. పసుపు తాడు, బంగారు తాళి బొట్లు ఒకదానికొకటి రాపిడి చెందడం వల్ల ఒక రకమైన సాత్విక శక్తి విడుదలవుతుంది. ఇది స్త్రీ శరీరంలోని రక్తప్రసరణను క్రమబద్ధీకరించి, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని మన పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు, వరుడు వేసే మూడు ముళ్ళు కేవలం బంధానికి గుర్తు కాదు. అవి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంకేతం. అలాగే స్త్రీ జీవితంలో పాటించాల్సిన మూడు ధర్మాలను... అవేంటంటే భర్త పట్ల నిబద్ధత, కుటుంబం పట్ల బాధ్యత, దైవం పట్ల భక్తిని ఈ మూడు ముళ్ళు నిరంతరం గుర్తుచేస్తాయి. మంగళసూత్రంలో ఉండే నల్లపూసలు కేవలం అందం కోసం కాదు. నూతన వధువుపై సమాజంలోని నకారాత్మక శక్తులు, దిష్టి పడకుండా ఈ నల్లపూసలు గ్రహిస్తాయి. ఇవి భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచి, మూడో వ్యక్తి వల్ల వచ్చే కలహాలను దూరం చేస్తాయి.
పూర్వీకుల ప్రకారం, మంగళసూత్రం ఎల్లప్పుడూ హృదయానికి తాకుతూ అంతర్గతంగానే ఉండాలి. దీనిని బయటకు ప్రదర్శించకూడదు. ఎందుకంటే, పసుపు తాడుకు ఉండే శక్తి నేరుగా స్త్రీ శరీరానికి తగిలినప్పుడే ఆమెకు ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. ఈ విధంగా నిండు నూరేళ్ల వైవాహిక బంధానికి, స్త్రీ సౌభాగ్యానికి, ఆరోగ్యానికి ప్రతీక అయిన మంగళసూత్ర సంప్రదాయాన్ని గౌరవిద్దాం. మన సంస్కృతిని కాపాడుకుందాం.




