YS Jagan: "డియర్ బ్రదర్ తారక్".. కేటీఆర్‌కు వైఎస్ జగన్ స్పెషల్ బర్త్ డే విషెస్!
YS Jagan: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
YS Jagan: "డియర్ బ్రదర్ తారక్".. కేటీఆర్‌కు వైఎస్ జగన్ స్పెషల్ బర్త్ డే విషెస్!
YS Jagan: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైఎస్ జగన్ ప్రత్యేక ట్వీట్..
కేటీఆర్ జన్మదినం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆప్యాయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్ డే, మై డియర్ బ్రదర్ తారక్! భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ప్రజల కోసం గట్టిగా నిలబడే బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీకు మరిన్ని విజయాలు దక్కాలని, ఈ ఏడాది అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ వైఎస్ జగన్ రాసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య ఉన్న ఈ ఆప్యాయపూర్వక బంధం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఘనంగా కేటీఆర్ బర్త్ డే వేడుకలు
మరోవైపు కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల అధినేతలు, మంత్రులు, ప్రముఖ సినీ నటులు కూడా కేటీఆర్‌కు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.




